High Court on Secretariat Demolition: తెలంగాణ సచివాలయం కూల్చివేతలపై స్టే రేపటి వరకు పొడిగింపు..

High Court on Secretariat Demolition: తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వం గత వారం సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Update: 2020-07-16 10:45 GMT

High Court on Secretariat Demolition: తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వం గత వారం సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణా సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలు అయిన ప్రజాప్రయోజనాల వాజ్యం పై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హై కోర్టు సచివాలయం కూల్చివేత పనులు చేపట్టొద్ద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే ఈ రోజు జరిపిన విచారణలో సచివాలయం కూల్చివేతలపై స్టే రేపటి వరకు పొడిగించింది. సచివాలయం కూల్చివేతలకు పర్యావరణ శాఖ అనుమతి అవసరమా లేదా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడమంటే ఏమిటో వివరించాలంది. పాత భవనాలు కూల్చడం కొత్త నిర్మాణానికి సిద్ధం చేయడమే కదా అని హైకోర్టు అంది. ఈ విషయాలపై రేపటి వరకు స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పీసీబీ, రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు అథారిటీ నివేదిక లపై హైకోర్టు అసంతృప్తి చెందింది. సూటిగా సమాధానం ఇవ్వకుండా తెలివిగా నివేదికలు ఇచ్చాయని అంది. అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా సమాచారం రాలేదని తెలిపింది. దీంతో ఏ ఎస్ జీ సోమవారం వరకు సమయం ఇవ్వాలని హై కోర్టును కోరింది. కాగా ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వ స్పష్టతే కీలకం అని హైకోర్టు సమాధానం ఇచ్చింది. 


Tags:    

Similar News