తెలంగాణలో పెరిగిన భూమి విలువ.. ఎల్లుండి నుంచి అమలు

Telangana: తెలంగాణలో భూముల విలువ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2021-07-20 13:32 GMT

తెలంగాణలో పెరిగిన భూమి విలువ.. ఎల్లుండి నుంచి అమలు

Telangana: తెలంగాణలో భూముల విలువ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి పెరిగిన భూముల ధరలు అమల్లోకి రానున్నాయి. అలాగే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది. ఒక్కోచోట ఒక్కో ధరను ప్రభుత్వం నిర్ణయించనుంది. మరోవైపు ఒక్కరోజే ఉండటంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు భారీగా తరలివస్తున్నారు ప్రజలు.

వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరానికి రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఓపెన్‌ ప్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.200కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక అపార్ట్‌మెంట్‌ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.వెయ్యికి పెంచారు. ఇప్పటికే స్లాట్లు బుక్‌ చేసుకున్నా కూడా పెరిగిన ధరనే చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో భూముల విలువ పెంపు ఈనెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.

Full View


Tags:    

Similar News