Telangana: ఓరుగల్లులో మెట్రో రైల్

Telangana: మహా నగరంగా గుర్తింపు పొందిన వరంగల్ మహా నగరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి.

Update: 2021-07-06 02:16 GMT

Warangal City

Telangana: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్ మాత్రమే. అలాంటి వరంగల్ లో మెట్రో పరుగులు పెట్టిస్తారంట. ఈ వార్త ఓరుగల్లు ప్రజలకు వీనులవిందుగా అనిపిస్తోంది. వరంగల్, హనుమకొండ రెండూ కలిపి పెద్ద సిటీగానే అవుతాయి. ఈ రెండిటిని కవర్ చేస్తూ మెట్రో రైల్ ప్లాన్ చేస్తున్నారంట. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం డీ.పీ.ఆర్ సిద్ధం చేసి.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు సమర్పించింది. అనుమతి రావడమే ఆలస్యం ..ఇక ఓరుగల్లులో రైలు కూత వినిపిస్తుంది.

2041 సంవత్సరం నాటికి వరంగల్ మహా నగర జనాభా 20 లక్షలకు చేరుకుంటుందనే అంచనాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఆ మేరకు రవాణా సదుపాయం కల్పించడానికి ముందస్తు ప్రణాళికలు జరుగుతున్నాయి. జనాభాకు అనుగుణంగా వరంగల్ -హన్మకొండ, కాజిపేట ట్రైసిటీస్ పరిదిలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన ప్రజా రవాణా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొంతభాగం రహదారి మీదుగా, మరికొంత భాగం మెట్రో రైల్ మార్గంలో ప్రజల ప్రయాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నా రు.

ఈ మేరకు డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ DPRను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందజేశారు. త్వరలో భిన్నమైన ఈ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ అధికారులు, పాలకవర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News