తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు.. ఎక్కడెక్కడో తెలుసా?

New Mandals: పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

Update: 2022-07-23 10:47 GMT

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు.. ఎక్కడెక్కడో తెలుసా?

New Mandals: పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగు ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు ప‌లు జిల్లాల్లో కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేర‌కు కొత్త మండ‌లాల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు పంపారు.

కొత్త మండ‌లాలు ఇవే..

1. గ‌ట్టుప్ప‌ల్‌(న‌ల్ల‌గొండ‌)

2. కౌకుంట‌(మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌)

3. ఆలూర్‌(నిజామాబాద్‌)

4. సాలూర‌(నిజామాబాద్‌)

5. డొంకేశ్వ‌ర్‌(నిజామాబాద్‌)

6. సీరోల్‌(మ‌హ‌బూబాబాద్‌)

7. నిజాంపేట్‌(సంగారెడ్డి)

8. డోంగ్లీ(కామారెడ్డి)

9. ఎండ‌ప‌ల్లి(జ‌గిత్యాల‌)

10. భీమారం(జ‌గిత్యాల‌)

11. గుండుమ‌ల్‌(నారాయ‌ణ‌పేట్‌)

12. కొత్త‌ప‌ల్లె(నారాయ‌ణ‌పేట్‌)

13. దుడ్యాల్(వికారాబాద్‌)

Tags:    

Similar News