AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటివద్ద పోలీసుల భద్రత పెంపు.. కారణం ఏంటంటే?
HYDRA: హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది.
HYDRA: హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది. అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. ఇప్పటికే ఎన్నో నిర్మాణాలు కూల్చేసింది. మున్ముందు ఇదే పంథాలో ముందుకు వెళ్లేందుకు పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోహైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ మేరకు వెంగళ్‌రావునగర్ డివిజన్ మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద సోమవారం ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు.
నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.
ఇటీవల సినీనటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్- కన్వెన్షన్ కూల్చివేత తర్వాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచినట్లు తెలుస్తోంది.