Telangana Budget 2023: సొంత జాగా ఉంటే రూ. 3లక్షలు.. ప్రతి నియోజకవర్గంలో 2వేల ఇండ్లు..!
Telangana Budget 2023: సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Telangana Budget 2023: సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో 2వేల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఆర్థికసాయం చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 2000 మంది చొప్పున 2,38,000 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున బడ్జెట్ లో ఈ పథకానికి 7,890 కోట్లు ప్రతిపాదించినట్లు హరీష్ రావు ప్రకటించారు.