CoronaVirus: కోవిడ్‌ విజృంభణతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

CoronaVirus: తెలంగాణలో కరోనా టెన్షన్‌ పుట్టిస్తోంది. కేసుల ఉధృతి భారీగా పెరిగింది. వారం రోజుల్లో దాదాపు 20 వేల మంది కరోనా బారిన పడ్డారు.

Update: 2021-04-16 04:53 GMT

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

CoronaVirus: తెలంగాణలో కరోనా టెన్షన్‌ పుట్టిస్తోంది. కేసుల ఉధృతి భారీగా పెరిగింది. వారం రోజుల్లో దాదాపు 20 వేల మంది కరోనా బారిన పడ్డారు. 47 మంది మృతి చెందారు. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితి చేజారకముందే ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ వైపు కోవిడ్ కట్టడి చర్యలు చేపడుతూనే.... కరోనా మరింత విస్తరిస్తే.. బాధితులు అంచనాకు మించి పెరిగితే ఏం చేయాలనే అంశాలపై దృష్టి పెట్టింది. అటు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌ను కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధం చేస్తోంది రాష్ట్ర వైద్యశాఖ. ఇప్పుడున్న బెడ్ల కంటే మరో 25 శాతం బెడ్లు కరోనా బాధితుల కోసం పెంచాలని ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా వైద్య సిబ్బందికి సెలవుల్ని కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది వైద్యశాఖ.

కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రొటోకాల్‌ ఏర్పాటు చేయాలని వైద్యశాఖ తెలిపింది. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న రోగులను చేర్చుకోవద్దని సూచించారు అధికారులు. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు లక్షణాలు లేని వారిని కూడా చేర్చుకుని చికిత్స అందిస్తున్నాయని.. వీటితో సీరియస్‌ ఉన్న వారికి బెడ్లు దొరకక ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతోందన్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌ వృథాను అరికట్టి.. ఆక్సిజన్‌ నిల్వలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

Tags:    

Similar News