వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: గవర్నర్‌ తమిళి సై

Update: 2021-01-24 04:30 GMT

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: గవర్నర్‌ తమిళి సై


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్నవర్‌ను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కుటుంబ సమేతంగా శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కాణిపాకం వెళ్లి వరసిద్ధి వినాయకుని దర్శించుకొని, రాత్రికి తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాల గోల్డెన్‌జూబ్లీ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, శ్రీకాళహస్తి చేరుకుంటారు. సాయంత్రం 6.25 గంటలకు హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు. గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా మన శాస్త్రవేత్తలే తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేకుండా అందరూ తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News