Birthday Wishes to PM Modi : ప్రధాని నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

Update: 2020-09-17 11:38 GMT

Birthday Wishes to PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ ను వేదికగా చేసుకుని గవర్నర్ తమిళిసై మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ దేశానికి గొప్ప ఆస్తి అని  కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన దేశానికి సేవ చేయాలంటూ సీఎం భగవంతుడిని ప్రార్థించారు.

ఇక పోతే 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ప్రస్తుతం మన భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. 2019 ఎన్నికలలో మళ్లీ గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు.



Tags:    

Similar News