School Holidays: విద్యార్థులకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్..ఆ రోజు సెలవు క్యాన్సిల్

School Holidays: గత రెండు, మూడేళ్లుగా సెలవులు ఎక్కువగా వస్తున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో గతేడాదిలో ఏకంగా వారం రోజులపాటు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. ఈ ఏడాది కూడా వర్షాల కారణంగా సెలవులు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా సెలవువల వచ్చ చదువు దెబ్బతినే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం విద్యార్థులకు షాకిచ్చినట్లేనని చెప్పుకోవచ్చు.

Update: 2024-09-08 04:28 GMT

School Holidays

School Holidays: గత రెండు, మూడేళ్లుగా సెలవులు ఎక్కువగా వస్తున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో గతేడాదిలో ఏకంగా వారం రోజులపాటు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. ఈ ఏడాది కూడా వర్షాల కారణంగా సెలవులు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా సెలవువల వచ్చ చదువు దెబ్బతినే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం విద్యార్థులకు షాకిచ్చినట్లేనని చెప్పుకోవచ్చు.

సెప్టెంబర్ 14వ తేదీన రెండవ శనివారం ఉంది. ఆ రోజు పాఠశాలలకు సెలవు ఉంది. 15వ తేదీన ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవు వచ్చింది. 16వ తేదీన మిలాద్ ఉన్ నబీ కాబట్టి..ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. 17వ తేదీన వినాయక నిమజ్జనం ఉంది. ఆ రోజు కూడా సెలవు ఉండటం వల్ల వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయని విద్యార్థులు భావించారు. కానీ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఓ సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

14,15 వ తేదీల్లో సెలువులు...16వ తేదీన మిలాద్ ఉన్ నబీ పండగ తేదీ మారింది. నెలవంక దర్శనాన్ని బట్టి ఈ పండగను 16వ తేదీ కాకుండా 17వ తేదీన జరుపుకుంటున్నారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో 16వ తేదీన ప్రభుత్వం సెలవు రద్దు చేసింది. 17న సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 17వ తేదీ సెలవు ఉంది కాబట్టి విద్యార్థులకు ఈ సెలవు క్యాన్సిల్ అవుతుంది.

చాలా మంది తల్లిదండ్రులు వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో టూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు వారి ప్లాన్ మార్చుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ప్లాన్ మార్చుకుని టూర్ కు వెళ్లాల్సి వస్తే వారి పిల్లలు 16వ తేదీన స్కూల్ డుమ్మా కొట్టాల్సిందే. ఒక రోజు స్కూల్ వెళ్లకపోతే ఏం కాదు అనుకున్నట్లయితే..టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

కాగా 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ పండగ ఉన్నా ఆ రోజు ఊరేగింపు ర్యాలీ మాత్రం ఉండదని తెలుస్తోంది. దాన్ని ఈనెల19వ తేదీకి వాయిదా వేయబోతున్నారని సమాచారం. ఎందుకంటే నిమజ్జనానికి ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ముస్లిం పెద్దలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News