Dharani Portal: అక్టోబర్ 3న 'ధరణి' పోర్టల్ ప్రారంభం..

Dharani Portal | అన్ లైన్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా తీసుకొస్తున్న 'ధరణి' పోర్టల్ ను అక్టోబర్ 3న ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Update: 2020-09-24 02:12 GMT

Dharani Portal | అన్ లైన్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా తీసుకొస్తున్న 'ధరణి' పోర్టల్ ను అక్టోబర్ 3న ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్న నేపధ్యంలో సాంకేతిక, మౌలిక వాతుల్ కోసం ఒక్కో కార్యాలయానికి ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించింది. అయితే, ఇకపై ఏ తరహా రిజిస్ట్రేషన్ అయినా, 'ధరణి' పోర్టల్ ద్వారా మాత్రమే జరగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ధరణి పోర్టల్‌ నిర్వహణకు వీలుగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన దృశ్యమాధ్యమం ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నమోదు కాని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పక్షం రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్న సీఎం ఆదేశాలను వెంటనే అమలుచేయాలని సూచించారు. రైతువేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలు, వీధి వ్యాపారుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. 


Tags:    

Similar News