Revoking Corona Treatment Permission: ప్రైవేటు ఆస్పత్రులపై కొరడా.. డక్కన్ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేత

Revoking Corona Treatment Permission: కరోనా విలయం... అందిన కాడికి అందరూ దోచుకుంటున్నారు..

Update: 2020-08-04 02:15 GMT
Revoking Corona Treatment Permission

Revoking Corona Treatment Permission: కరోనా విలయం... అందిన కాడికి అందరూ దోచుకుంటున్నారు... ఒక్కరేమిటి మాస్క్ ల దగ్గర్నుంచి మందులు చికిత్సల వరకు. మాస్క్ లు మందులైతే పర్లేదు..వందలు వేలు తో పోతోంది. ఆస్పత్రుల్లో చికిత్స అయితే లక్షల్లోనే వసూలు చేస్తున్నారు. రోగుల తీవ్రత పెరుగుతుండటంతో వీలైనంత అధికంగా చికిత్సలు జరగాలని తెలంగాణా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ అవకాశాన్ని చాలా వరకు ఆస్పత్రులు అందిపుచ్చుకున్నాయి. కరోనా రోగుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలుకు నిర్ణయించాయి. ఇదే కాదు. ఒక ఆస్పత్రిలో కరోనా నెగెటివ్ వచ్చినా ఆ రోగి వద్ద నుంచి లక్షల బిల్లులు వసూలు చేశారు. ఈ క్రీడంతా ప్రభుత్వంలోని ఉన్న పెద్దలకు చేరడంతో ఎట్టకేలకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కరోనా చికిత్సకు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు చర్యలకు దిగింది. హైదరాబాద్ సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్ కు ఇచ్చిన కరోనా ట్రీట్‌మెంట్ పర్మిషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై కరో నా పేషెంట్లను అడ్మిట్ చేసుకోవద్దని ఆదేశించింది.

కరోనా చికిత్స పేరుతో అనేక మంది రోగుల నుంచి డెక్కన్ ఆస్పత్రి లక్షల రూపాయల కొద్ది బిల్లులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, ఇష్టారాజ్యంగా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సర్కార్ ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆస్పత్రిపై వస్తున్న ఆరోపణలు నిజమని రుజువు కావడంతో ప్రభుత్వం ఇలా షాక్ ఇచ్చింది. అయితే కేవలం కరోనా చికిత్సను మాత్రమే నిలిపివేస్తూ.. మిగిలిన చికిత్సలకు యధావిధిగా అనుమతి ఇచ్చారు.  

Tags:    

Similar News