Ration Card: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక అప్ డేట్..రేషన్ కార్డులకు టెక్నాలజీ మిక్స్
Ration Card: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డులకు టెక్నాలజీని మిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే జరిగితే ప్రజలు రేషన్ కార్డులు తమ దగ్గరే ఉంచుకుంటారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ration Card: టెక్నాలజీ జెడ్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచమే. మనం కూడా టెక్నాలజీతో పాటు ముందుకు సాగడం తప్పనిసరి. లేదంటే వెనకబడే ఉంటాం. అందుకే తెలంగాణ సర్కార్ టెక్నాలజీతో వస్తున్న మార్పులను వినియోగించుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలనుకూడా అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం..వాటికి కూడా స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.
ఏటీఎం తరహాలోనే కొత్త రేషన్ కార్డులు ఉండబోతాయన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినా..ప్రభుత్వ వర్గాల నుంచి ఈ సమాచారం వస్తోంది. కొత్త రేషన్ కార్డును స్వైప్ చేసేందుకు వీలుండేలా తయారుచేయబోతున్నట్లు సమాచారం. అప్పుడు రేషన్ సరుకులు తీసుకున్నవారు..షాపింగ్ మాల్స్ లో స్వైప్ చేసినంత ఈజీగా రేషన్ కార్డును స్వైప్ చేసి కావాల్సిన సరుకులు తీసుకోవచ్చు.
ఈ స్వైపింగ్ కార్డుల వల్ల పని ఈజీగా అయిపోతుంది. అదే పాత విధానంలో సరుకులు ఇచ్చిన తర్వాత థంబ్ ఇంప్రెషన్ తీసుకునేవాళ్లు. ఒక్కోసారి డిజిటల్ లో ఫింగర్ ప్రింట్ వచ్చేది కాదు. అంతేకాదు రేషన్ పంపిణీలో కూడా అక్రమాలు భారీగా జరిగేవి. కొత్త రేషన్ కార్డులను స్వైపింగ్ సౌకర్యంతో ఇస్తే అక్రమాలకు ఛాన్స్ ఉండదని అంటున్నారు. ఏటీఎం కార్డులన్నీ చిప్ ఆధారంగానే పనిచేస్తాయి. అయితే కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఏటీఎం కార్డు మాదిరిగానే యాక్టివేట్ చేసుకోవాలి. రేషన్ పంపిణీ నిర్వాహకులు మాత్రమే ఈ పని చేస్తారు. యాక్టివేట్ తర్వాత మరింత సులభంగా సరుకులు తీసుకుంటారు.