పులి దాడిలో యువకుని మృతితో అలెర్ట్ అయిన అటవీశాఖ

కొమురం భీం జిల్లాలోని దహేగం మండలం దిగడలో పులి దాడిలో యువకుడు మృతి నేపథ్యంలో అటవీశాఖ అలర్ట్ అయ్యింది.ఇంకెవరికి ప్రాణ నష్టం జరగక ముందే పులిని బంధించాలని నిర్ణయించింది.

Update: 2020-11-13 05:20 GMT

కొమురం భీం జిల్లాలోని దహేగం మండలం దిగడలో పులి దాడిలో యువకుడు మృతి నేపథ్యంలో అటవీశాఖ అలర్ట్ అయ్యింది.ఇంకెవరికి ప్రాణ నష్టం జరగక ముందే పులిని బంధించాలని నిర్ణయించింది.ఈ మేరకు పులి బంధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్ అటవీ డివిజన్ పులులకు అవాసంగా మారింది. దహేగం, బెజ్జూరు,కాగజ్ నగర్‌తో పాటు మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 11 పులులు తిరుగుతున్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. మరోవైపు విఘ్నేష్‌ను హతమార్చింది మగ పులిగా నిర్ధారణ అయ్యింది. మృతుని శరీరంపై ఉన్న గోర్ల ఆధారంగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. మృతుని కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

- విగ్నేష్ పై దాడి చేసిన పులిని K8 asf2 అయి ఉండవచ్చని పేర్కొన్నారు.

- మృతుని కుటుంబం లో ఒకరికి వాచర్ గా ఉద్యోగం కల్పిస్తామని అటవీ శాఖ మంత్రి హామీ ఇచ్చారు

- మొత్తం 20 బోన్లను ఏర్పాటు చేసి పులి ని బంధిస్తమంటున్న అటవీ శాఖ అధికారులు

- నెల రోజులు అడవి సమీప ప్రాంత గ్రామాల ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్ళొదని అటవీ శాఖ ఆదేశాలు జారీచేశారు 

Tags:    

Similar News