Telangana Eamcet 2020: నేటి నుంచి తెలంగాణాలో ఎంసెట్.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
Telangana Eamcet 2020 | ఇప్పటికే ఈ సెట్ పూర్తి చేసిన తెలంగాణా ప్రభుత్వం నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఎంసెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Telangana Eamcet 2020 | ఇప్పటికే ఈ సెట్ పూర్తి చేసిన తెలంగాణా ప్రభుత్వం నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఎంసెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నేపథ్యంలో్ ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు కరోనా వైరస్ లక్షణాలుంటే వెనక్కి పంపేలా చర్యలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ను నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.తెలంగాణలో 79, కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచే అనుమతి స్తామని ఎంసెట్ కమిటీ పేర్కొంది. ఉదయం పరీక్ష 9 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుందని, ఆ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది. వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచిం చింది. హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్‌ను కూడా ఇచ్చామని తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునా శానిటైజేషన్ చర్యలు చేపట్టామని, విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి గుర్తుంచుకోండి..
♦ పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకుంటారు.
♦ విద్యార్థులు తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. డాక్టర్ సర్టిఫికెట్ అవసరం లేదు.
♦ పరీక్ష కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలైన హైఫీవర్, తీవ్రమైన దగ్గు, శ్వాస సంబంధ సమస్య ఉంటే వెనక్కి పంపిస్తారు.
♦ వారు ఆ పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్‌కు తమ వివరాలతో ఒక లెటర్ రాసి ఇస్తే వారికి తరువాత రోజు సెషన్లలో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపడతారు.
♦ కరోనా పాజిటివ్ వచ్చిన వారు సమాచారం ఇస్తే వారికి తరువాత ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిరు.
♦ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్ అధికారి/ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు.
♦ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ వంటి ఏదేని ఒరిజినల్ ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి.
♦ రఫ్ వర్క్ కోసం వినియోగించిన బుక్‌లెట్‌ను ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇచ్చివేయాలి.
♦ మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్‌ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులే తెచ్చుకోవాలి.
♦ విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రవేశాల సమయంలో అడుగుతారు.