CPM Public Meeting in Online: కొత్త పుంతలు తొక్కుతున్న సమావేశాలు..
CPM Public Meeting in Online: కరోనా వైరస్ చెప్పలేని వింతుల, విడ్డూరాలు మోసుకొచ్చినట్టు కనిపిస్తోంది..
CPM Public Meeting in Online: కరోనా వైరస్ చెప్పలేని వింతుల, విడ్డూరాలు మోసుకొచ్చినట్టు కనిపిస్తోంది... ఏక వ్యక్తికి మినహా సమూహాల పరంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలపై దాని ప్రభావం పడింది.. గతంలో మాదిరి అందరూ కలిసి కట్టుగా కార్యక్రమం నిర్వహించుకుంటామంటే కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. ఇది పరోక్షంగా కరోనా వ్యాప్తికి సహకరిస్తుందని భావించి, ప్రత్యామ్నాయ విధానాలవైపు మరలుతున్నారు. ఇది ఇంతవరకు కేవలం చిన్న, చిన్న సమావేశాలకే పరిమితమైన వ్యవహారం తాజాగా బహిరంగ సభల్లోనూ నిర్వహించేందుకు దోహదం చేసింది. ఖమ్మం జిల్లాలో సీపీఎం పార్టీ నిర్వహించే జిల్లా బహిరంగ సభ ఆన్లైన్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని విషయాలు, రంగాల్లోనూ సాంకేతికత తనదైన స్ఠానాన్ని చాటుకుంటోంది. ఈ విషయంలో... మాట్లాడుకుంటూ వెళితే... సమయమే సరిపోదు. ఇక ఈ క్రమంలోనే... మరో అంశం... రాజకీయపక్షాలు సైతం తమ బహిరంగ సభలను 'ఆన్‌లైన్'లో నిర్వహించే దిశగా అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలోనే... సీపీఎం ఖమ్మం జిల్లా పార్టీ 'ఆన్‌లైన్ బహిరంగ సభ' జరగబోతోంది.
సాయంత్రం ఆరు గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ, దానిని ఆరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, రైతులు, కార్మికులు, మహిళలు సహా ఆయా వర్గాలు ఎదుర్కొంటోన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలన్న డిమాండ్ ప్రధానంగా ఈ బహిరంగ సభ జరగనుంది. సీపీఎం ఖమ్మం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మెదటి సారిగా... ఈ 'ఆన్‌లైన్' బహిరంగ సభ జరగబోతోంది.
పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల హైమావతి , జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొంటారని సీపీఎం జిల్లా నాయకుడు ఏటుకూరి రామారావు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ఆన్‌లైన్ బహిరంగ సభలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ సభకు సంబంధించి... ఫేస్‌బుక్ లైవ్ తో పాటు మరో జనరల్ లింక్ లో కూడా ఈ రోజు లైవ్‌లో ప్రసారాలుంటాయని తెలిపారు.