తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేయడానికి యాంటీబాడిస్ టెస్టింగ్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో యాంటీబాడీస్ టెస్టింగ్స్‌తో మంచి ఫలితాలు వచ్చాయి. అదే తరహాలో తెలంగాణలో కూడా మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఇప్పటి వరకు అసలు యాంటీబాడీస్ టెస్ట్‌లు చేస్తామని ఊరిస్తున్న ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ సర్కార్ కరోనా భారీ నుండి కోలుకున్న వారి దగ్గర నుంచి యాంటీ బాడీస్ టెస్టింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోలుకున్న వారు ప్లాస్మా ఇవ్వాలని అనుకుంటే యాంటీబాడిస్ పరీక్ష తప్పనిసరి కావడంతో మరిన్ని యాంటీబాడీస్ పరీక్షలు చేయాలని ముఖ్యంగా హైదరాబాద్ ghmc పరిధిలో కేసులు పెడుగుతుండడంతో పరీక్షలు అత్యధికంగా చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే ఇతర చోట్ల ఉన్న యాంటీబాడీస్ టెస్ట్ విజయవంతం అయ్యాయని తెలంగాణలో కూడా యాంటీబాడీస్ టెస్ట్‌లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. మన దగ్గర యాంటీబాడిస్ టెస్ట్ చేయడం వలన ప్లాస్మా ఇవ్వడం విషయంలో కూడా ఫలితాలు బాగుంటాయని అంటున్నారు. యాంటీబాడీస్ టెస్ట్ చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదని కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. ప్రభుత్వమే టెస్ట్‌లు చేయాలనుకోవడం మంచి నిర్ణయం అంటున్నారు వైద్యులు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ఎన్నిసార్లు విన్నవించినా వైద్యశాఖ ముందుకురావడం లేదంటున్నారు మెడికల్ జాక్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తిలో ఉన్న యాంటీ బాడీస్ లెవెల్స్‌తో పాటు ప్లాస్మా దానం చెయ్యడానికి అర్హులా కదా అనే విషయాన్ని తెలుసుకోవడం మంచి నిర్ణయమంటున్నారు వైద్యులు.