Congress: రేపు మేనిఫెస్టో విడుదల చేయనున్న తెలంగాణ కాంగ్రెస్
Congress: రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమిషన్..
Congress: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ రేపు మేనిఫెస్టో విడుదల చేయనుంది. మేనిఫెస్టోను మల్లికార్జునఖర్గే విడుదల చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్స్‌ను ప్రకటించింది. గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమిషన్, అభయ హస్తం పథకం తిరిగి పునరుద్ధరణ, ఇక ఆర్ఎంపీ, పీఏంపీలకు గుర్తింపు కార్డు, అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువులను పంపిణీ, ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నామని మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు.
ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్‌గ్రేడ్ యాప్, ఇక జర్నలిస్ట్‌లకు మెట్రో ఫ్రీ, మీడియా కమీషన్ ఏర్పాటు, కల్యాణలక్ష్మీ కింద లక్ష సాయం, తులం బంగారం, రేషన్ ద్వారా సన్న బియ్యం, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఉద్యోగ కల్పన, ఆటో వాళ్లకి ఆర్థిక సహాయం అందించనున్నారు.