Congress Leader Dies With Coronavirus : కరోనా వైరస్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేత మృతి
Congress Leader Dies With Coronavirus : తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. అనేక మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356 మంది చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబసభ్యులు, అనుచరులు తీవ్ర విచారంలో ఉన్నారు.
ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా నరేందర్ పాల్గొన్నారు. దీంతో నరేందర్ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా నరేందర్ మృతికి పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణలో ఆదివారం 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో నిన్న 8 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 34 వేల 671 కేసులు నమోదు కాగా 356 మంది చనిపోయారు. ఇంకా 11, 883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 1,563 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 22,482 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 800 మంది కరోనా బారిన పడ్డారు.