Revanth Reddy Protests Against Centre: అందుకే ప్రధాని విదేశాలకు పారిపోయారు.. ఈడీ ఆఫీస్ ఎదుట రేవంత్ ధర్నా

Update: 2024-08-22 08:55 GMT

Revanth Reddy Protests Against Centre: గౌతం అదాని అక్రమ పద్ధతుల్లో సంపద పెంచుకున్నారని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతం అదాని వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్ తో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం హైదరాబాద్ లోని గన్ పార్క్ ఎదుట ధర్నాకు దిగింది. అనంతరం ఆర్థిక నేరాలను అరికట్టే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " గౌతం అదాని మన దేశ సంపదను షేర్ మార్కెట్ ఎలా కొల్లగొడుతున్నారనే నిజాలను హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు" అని ఆరోపించారు. ఈ అంశంపై రాజ్యసభలో, లోక్ సభలో జాతీయ స్థాయిలో మల్లిఖార్జున ఖర్గె, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కొట్లాడుతున్నప్పటికీ.. కేంద్రం ఎవ్వరిని వినిపించుకునే పరిస్థితిలో లేదన్నారు. గౌతం అదాని అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటి వేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. కానీ అలా చేయడం ఇష్టం లేని ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజులు ముందుగానే సభను ముగించుకుని దేశం విడిచిపారిపోయారని మండిపడ్డారు.

గౌతం అదాని అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేస్తోన్న పోరాటంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఇలా తాము ధర్నాకు దిగినట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

Tags:    

Similar News