KCR: దళితబంధుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమావేశం.. మంత్రులు, కలెక్టర్లతో...

KCR: పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లపై చర్చించే ఛాన్స్...

Update: 2021-12-18 02:30 GMT

KCR: దళితబంధుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమావేశం.. మంత్రులు, కలెక్టర్లతో...

KCR: దళిత బంధుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో అమలవుతున్న మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి లోగా అందిస్తామని గతంలో సీఎం స్పష్టం చేశారు. దానిలో భాగంగా తీసుకొంటున్న చర్యలు... భవిష్యత్ ప్రణాళికలపై మంత్రులు, అన్ని జిల్లాల్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు.

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయదలుచుకున్న దళిత బంధు పథకానికి ప్రతి ఏటా బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయల నిధులను పెడతామని పథకం ప్రారంభం సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానిలో భాగంగా హుజురాబాద్‌లో 2 వేల 400 కోట్లతో మొదట ప్రారంభించారు. ఆ తరువాత వాసాల మర్రితో పాటు మరో నాలుగు మండలాల్లో పథకం అమలు చేయనుట్లు తెలిపారు.

అయితే అనివార్య కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. అంతలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తరువాత ప్రభుత్వం దళిత బంధుపై వెనక్కి తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో సీఎం మరోసారి ప్రగతి భవన్‌లో ఈ రోజు సమావేశం కానున్నారు.

పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నందున సాధ్యాసాధ్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలోకి వెళ్లినా.. లబ్ధిదారులకు అందలేదు. అదే విధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, డబుల్ బెడ్ రూమ్ ల పరిస్థితి, దళితుల స్థితిగతులపై చర్చించే అవకాశం ఉంది. 

ఇవాళ్టి సమావేశంలో పూర్తిగా పాలన పరమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి ఒకే శాఖలో ఉంటున్న ఐఏఎస్ లను త్వరలోనే బదిలీ చేయనున్నారు. ప్రస్తుతం సీఎంఓ కార్యాలయంలో రాహుల్ బొజ్జకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానీయ, పంచాయితీ రాజ్ సెక్రటరీ శరత్ లతో పాటు మరికొంత మంది అధికారులకు స్థాన చలనం అయ్యే అవకాశం ఉంది.

సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు అదనపు కలెక్టర్ లు ఉన్నందున పూర్తి స్థాయిలో కలెక్టర్ లను నియమించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో వెళ్లేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లదే బాధ్యత కావడంతో దళిత బంధు లాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినా... ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయరో, దానికి గల కారణాలను అధికారుల నుండి తీసుకోనున్నారు. 

Tags:    

Similar News