TS Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం
TS Cabinet: సుమారు రూ.3లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు
TS Cabinet: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సుమారు 3లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు ఉండనున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు.