నేడు తెలంగాణ బడ్జెట్‌.. శాసనసభలో మ.12 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి

Telangana Budget 2024-25: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

Update: 2024-07-25 05:17 GMT

కాసేపట్లో కేబినెట్ మీటింగ్.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

Telangana Budget 2024-25: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ బడ్జెట్ మొత్తం 2 లక్షల 80 వేల కోట్ల నుంచి 2 లక్షల 90 వేల కోట్ల వరకు ఉండే అవకాశముంది. ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు 50 వేల కోట్లకు పైగా కేటాయించే అవకాశముంది. ఇదిలా ఉంటే..రెండు రోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించనందున దాని ప్రభావం రాష్ట్ర పద్దుపై పడే అవకాశాలున్నాయి.

గతేడాది 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కింద 41వేల 259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా 13 వేల 953 కోట్లు వచ్చాయి.. ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21 వేల 075 కోట్లు వస్తాయని ఓటాన్‌ ఎకౌంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ మొదటి త్రైమాసికంలో ఏమీ రాలేదు. దీంతో..ఓటాన్‌ అకౌంట్‌లో చూపిన విధంగా కేంద్ర గ్రాంట్ల మొత్తాన్ని ఇప్పుడు యథాతథంగా చూపాలా లేక తగ్గించాలా అనేది రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించనున్నారని సమాచారం.

అంసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో మంత్రివర్గం సమావేశమై. వార్షిక బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనుంది.

Tags:    

Similar News