రేపు తెలంగాణ కేబినెట్ భేటీ!
ప్రగతిభవన్‌లో మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దుబ్బాకలో ఓటమి, రైతు సమస్యలపై మంతనాలు జరుపుతున్నారు.
రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశంకానుంది. సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశంకానున్న కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా దుబ్బాకలో ఓటమికి దారితీసిన కారణాలపై విశ్లేషించి ఏఏ అంశాల్లో సరిచేసుకోవాల్సి ఉందో చర్చించనున్నారు. అలాగే, త్వరలో జరగనున్న GHMC, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, రైతు సమస్యలు, వరద సాయం వివాదంపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ప్రగతిభవన్‌లో మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దుబ్బాకలో ఓటమి, రైతు సమస్యలపై మంతనాలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న GHMC, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. అయితే, దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి కారణాలను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.... సిట్టింగ్ సీటులో ఎందుకంత వ్యతిరేకత వచ్చింది... ఎక్కడ విఫలమయ్యామంటూ విశ్లేషించారు. అదేసమయంలో, విపక్షాలు పుంజుకోకముందే GHMC ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో, GHMCలో నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. ఇక, హైదరాబాద్‌లో వరద సాయంపై జరుగుతోన్న రగడంపై సీఎం కేసీఆర్ చర్చించారు.