తెలంగాణ బడ్జెట్ 2024-25: ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి విక్రమార్క
Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ 2024 -25 ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ 2024 -25 ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టింది. రూ. 2,01,178 కోట్ల రెవిన్యూ వ్యయం, రూ. 29,669 కోట్ల మూలధన వ్యయంగా బడ్జెట్ ను ప్రతిపాదించారు.
కేంద్ర బడ్జెట్ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్టుగా అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. రేపు పూర్తిస్థాయి బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టనుంది.