Pebbair: మెడికల్ షాప్ యజమానులతో తహసీల్దార్ అత్యవసర సమావేశం
కరోనా వ్యాధి కట్టడి చేయుటకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలనుసారం, శుక్రవారం సాయంత్రం పెబ్బేరు పట్టణంలోని మెడికల్ షాప్ యజమానులతో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగినది.
కరోనా వ్యాధి కట్టడి చేయుటకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలనుసారం, శుక్రవారం సాయంత్రం పెబ్బేరు పట్టణంలోని మెడికల్ షాప్ యజమానులతో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగినది.ఇందులో తరుచూ అనారోగ్యంతో ఉంటూ జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో గాని, అటువంటి వ్యాధులకు మెడిసిన్స్ కోసం ఎవరైనా తరుచుగా మెడికల్ షాపులకు వస్తే వారి పూర్తి వివరాలు నమోదు చేసుకొని, సంబంధిత అధికారులకు కాని, ఆరోగ్య శాఖ వారికీ కాని సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ ఘన్సిరాం తెలిపారు.
మెడికల్ షాపుల యజమానులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అందరు అనుసరించాలని, కరోనా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక చైర్ పర్సన్ శ్రీమతి ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్ పర్సన్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్, వైస్ చైర్మన్ కర్రే స్వామి, తహసీల్దార్ ఘాన్సిరాం, మునిసిపల్ కమిషనర్ చలపతయ్య, ఎస్సై రాఘవేందర్ రెడ్డి, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.