Talasani: చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు
Talasani: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు
Talasani: మృగశిర కార్తె సమీపిస్తుండడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఆస్తమా బాధితుల కోసం బత్తిన కుటుంబ సభ్యులు 178 ఏళ్లుగా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు.ఈసారి చేప మందు ప్రసాదం కోసం దాదాపు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకుంటున్నారు.
ఉబ్బస వ్యాధి గ్రస్థులకు చేప మందు ప్రసాదం ఎంతగానో ఉపయోగపడుతుందని చాలా మంది నమ్మకం.. ఇందుకోసం ప్రతి సంవత్సరం లక్షలాదిగా ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.. అయితే కరోనాతో గత 3 సంవత్సరాలుగా చేప ప్రసాదాన్ని ఆపివేశారు..మూడేండ్ల తర్వాత ఈసారి చేప మందు పంపిణి చేస్తుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఏటా 4 లక్షల మంది వచ్చేవారు. ఈసారి రాష్ట్రంతోపాటు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి 5నుంచి 6 లక్షల మంది రావచ్చని బత్తిన కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటున్నారు.
చేప మందు ప్రసాదం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు..మత్స్యశాఖ చేప పిల్లలను సమకూరుస్తోందని మంత్రి తలసాని తెలిపారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించడానికి స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్మెయిన్గేట్నుంచి లోపలికి రాగానే కుడి భాగంలో 18 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యూలైన్ లో దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నిర్విరామంగా చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ తర్వాత రెండ్రోజులపాటు దూద్ బౌలిలోని బత్తిన సోదరుల ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
చేప ప్రసాదానికి మరో 3 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచినాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకుంటున్నారు.. వారికి అక్కడ ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడించారు . చేప ప్రసాదం నుంచి ప్రతి సంవత్సరం హైదరాబాద్ వస్తామని ఉబ్బసం వ్యాధి తగ్గిపోతుందని నమ్మకం ఉందన్నారు..
చేప ప్రసాదం కోసం వచ్చే వారికీ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంచి నీటి సదుపాయం, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.