Swineflu in Telangana: తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం.. నగరంలో నాలుగు కేసులు
Swineflu in Telangana:తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. అనేక ఏండ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నాలుగు కేసులను నిర్ధారించడంతో మరోసారి కలకలం రేపింది.
Swineflu in Telangana: తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుంటే..మరోవైపు విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. విషజ్వరాలతో నగర వాసులకే కాదు రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు కూడా విలవిలలాడుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కానీ స్వైన్ ఫ్లూ ఇప్పుడు మరోసారి కలకలం రేపింది. రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అధికారులు హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నాలుగు కేసులు నమోదు అయినట్లు నిర్ధారించింది.
మాదాపూర్ లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన యువకుడు తీవ్ర దగ్గు తదితర లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. వారు అనుమానించి అక్కడ పరిక్షించింది నారాయణగూడ ఐపీఎంకు నమూనాలను పంపించారు.
అయితే ఈ లక్షణాలను స్వైన్ ఫ్లూగా ఐపీఎం నిర్ధారించింది. టోకిచౌకికి చెందిన ఓ వ్రుద్ధుడికి, నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన ఓ వ్యక్తికి, హైదర్ నగర్ డివిజన్ లోని మహిళలకు స్వైన్ ఫ్లూ సోకినట్లు తేల్చింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన ఝార్ఖండ్ వ్రుద్ధురాలికి కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలిపింది.