Swadadri Real Estate Scam: పోలీసుల అదుపులో స్వాదాద్రి రియల్‌ ఎస్టేట్‌ ఎండీ రఘు!

Swadadri Real Estate Scam: స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.

Update: 2020-07-04 16:15 GMT

Swadadri Real Estate Scam:  స్వాదాద్రి రియల్ ఎస్టేట్ కుంభకోణం కేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్వాదాద్రి రియల్‌ ఎస్టేట్‌ ఎండీ రఘుతో పాటు శ్రీనివాస్‌, మీనాక్షి అనే మరో ఇద్దరు ఉన్నారు. ప్రజలను మోసం చేసి వారి దగ్గరి నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసి ఆ డ‌బ్బుల‌తో భూముల‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్ శనివారం వెల్లడించారు. ఈ కేసులో నిందితులు సుమారు మూడు వేల మందిని మోసం చేసారని, వారంతా వీరి మాటలు విని మోస పోయారని విచారణలో తేలిందన్నారు. న‌గ‌రానికి చెందిన‌ యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ ప‌లువురిని న‌మ్మించి మోసం చేశారని సజ్జనార్‌ తెలిపారు. ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తెలిపారు.

న‌గ‌రానికి చెందిన‌ యార్లగడ్డ రఘు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజలకు అధిక వడ్డీ ఇస్తానంటూ ప‌లువురు అమాయక ప్రజలను న‌మ్మించాడని తెలిపారు. అత‌ని మాటలు న‌మ్మిన అనేక‌మంది పెద్ద మొత్తంలో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ తరువాత వారి ద‌గ్గ‌ర‌ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడని తెలిపారు. ఇదంతా గమనించిన ఓ బాధితుడు కంపెనీ పేరు చెప్పి మోసం చేస్తున్నారని గ్రహించి మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు చేసిన కుంభకోణం బయటపడిందని తెలిపారు. ఈ స్కామ్‌లో ఏజెంట్ల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News