తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుద్ధభవన్ కమిషన్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డితో పాటు మిగతా సభ్యులకు మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తమపై ఉంచిన గురుత బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు సునీతా లక్ష్మారెడ్డి.