Car Catches Fire: మీకు కారు ఉందా? అయితే జర జాగ్రత్త..!
Car Catches Fire: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడో చోట కార్లలో మంటలు చెలరేగుతుంటాయి.
Car Catching Fire: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడో చోట కార్లలో మంటలు చెలరేగుతుంటాయి. అదృష్టం బాగుంటే కారులోని ప్రాణాలతో బయటపడతారు. లేకపోతే గాయాలపాలవుతారు. ఎండాకాలంలోనే కార్లలో అధిక అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణమేంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
ఎండాకాలంలో ఎక్కువగా కార్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఆకస్మాత్తుగా కార్లలో మంటలు చెలరేగుతాయి. అలర్ట్ గా లేకపోతే కారులో ప్రయాణిస్తున్నవారు మంటల్లో చిక్కుకోనే ప్రమాదం ఉంటుంది. వేసవిలో కార్లు ఓవర్ హీట్ అవుతాయి. ఇంజిన్ లోపలి ఫ్యాన్ సరిగా తిరగదు. దీంతో మంటలు చెలరేగుతాయి. కొన్నిసార్లు షార్ట్ సర్క్వూట్ వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ఇందుకోసం ఆయిల్ , కూలింగ్ పట్ల జాగ్రత్త వహించాలి.
కార్లను సకాలంలో సర్వీసింగ్ చేయించాలి. పాత కార్లు వాడరాదు. పైపులు వేడెక్కి ఇంజిన్ పై పడి మంటలు చెలరేగుతాయి. ఎక్స్ ట్రా యాక్సెసరీస్ ను జాగ్రత్తగా గమనించాలి. ఫ్యూయల్ పైప్ ను ఎప్పటికప్పడు కట్ చేయించుకోవాలి. లేకపోతే వేసవిలో కార్లలో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.
కొంత మంది కార్లు కొన్న తర్వాత మరిన్ని లైట్ల కోసం ఎక్స్ ట్రా యాక్సెసరీస్ వేసుకుంటారు. దీంతో వైరింగ్ పై భారం పడుతుంది. వేడెక్కి షార్ట్ సర్క్వూట్ తో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఎక్స్ ట్రా యాక్సెసరీస్ పై జాగ్రత్త వహించాలి. ఎండకాలంలో కార్లు నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెకానిక్ లు సూచిస్తున్నారు.