Students like Suharsha make us proud : తెలంగాణ బిడ్డలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించడం గర్వకారణం: మాజీ ఎంపీ కవిత
Students like Suharsha make us proud : అమెరికా లోని ప్రతిష్ఠాత్మక అబర్న్ యూనివర్సిటీలో సీటు సాధించిన మంచిర్యాలకు చెందిన సుహర్షను ప్రత్యేకంగా అభినందించారు మాజీ ఎంపీ కవిత. తెలంగాణ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించడం పట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అబర్న్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన మంచిర్యాల పట్టణానికి చెందిన సుహర్షను కవిత అభినందించారు. సుహర్షను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించిన మాజీ ఎంపీ కవిత, సుహర్షకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సుహర్షతో, సుహర్ష తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన మాజీ ఎంపీ కవిత కుటుంబ, వ్యక్తిగత వివరాల గురించి కూలంకషంగా చర్చించారు. సుహర్ష మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించిన కవిత సుహర్ష, యువతకు ఆదర్శం అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత అమెరికా లో ఉన్నత చదువులు అభ్యసించిన జ్ఞాపకాలను సుహర్షతో పంచుకున్నారు. మిసిసిప్పిలో ఎంఎస్ చదువుకున్న కవిత, అప్పుడు 500 డాలర్లు స్టైఫండ్ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం సుహర్ష సీటు సాధించిన అలబామా పక్కన ఉండే మిసిసిప్పి నగరంలోనే నివసించిన కవిత అక్కడి పరిస్థితులను సుహర్షతో పంచుకున్నారు.
Students like Suharsha make us proud. Congratulated her for recieving fee waiver and scholarship at Auburn University. May she achieve all her goals. Feels so nostalgic, remembered my University days in the US, after our chat.#TelanganaFCRI pic.twitter.com/25kw2xrvUs
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 25, 2020