ఇంట్లో నయా బాంబ్ ...ప్రాణాలు తీసిన ఫ్రిజ్

రిఫ్రిజిరేటర్‌లోని గ్యాస్‌ సిలిండర్ పేలడంతో ఓ విద్యార్థిని సజీవ దహనమైంది.

Update: 2018-12-28 08:27 GMT
Deepika

Telangana: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. రిఫ్రిజిరేటర్‌లోని గ్యాస్‌ సిలిండర్ పేలడంతో ఓ విద్యార్థిని సజీవ దహనమైంది. బొంగులూరు గ్రామానికి చెందిన మనోహర్, లావణ్య దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి మై హోమ్స్‌ కాలనీలో నివాసముంటున్నారు. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న దీపిక పరీక్షలు ఉండటంతో ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఒంటరిగా ఉన్న సమయంలో మంచినీళ్ల కోసం ఫ‌్రిజ్ డోర్ తెరిచింది. భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి దీపికకు అంటుకోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఇల్లంతా షార్ట్ సర్క్యూట్ కావడంతో వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. దీపిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన కొప్పు మనోహర్, లావణ్య దంపతులు ఐదేళ్లుగా పిల్లల చదువుకోసం బొంగులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మై హోమ్స్ కాలనీలో ఉంటున్నారు. అక్కడే సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడిన మనోహర్ టీవీ మరమ్మతులు చేస్తుండగా, ఆయన భార్య లావణ‌్య టైలరింగ్ చేస్తుంది. తల్లిదండ్రులు విధులకు, సోదరి పాఠశాలకు వెళ్లడంతో ఇంట్లోనే తలుపులు వేసుకుని చదువుకుంటోంది దీపిక. ఆ సమయంలో దాహం వేయడంతో వాటర్ బాటిల్ కోసం ఫ్రిజ్ డోర్ తెరిచింది. అంతే బాంబు పేలినట్టు ఫ్రిజ్ పేలిపోయింది. పేలుడు దాటికి ఫ‌్రిజ్ డోర్ ఎగిరిపడింది. మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే, కొద్దిరోజులుగా ఆ ఫ్రిజ్ తాకితే షాక్ కొడుతున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీపికి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Tags:    

Similar News