Narayanpet: స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియాను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సివిల్ లైన్ బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ హరిచందన ఆకస్మికంగా సందర్శించి కలెక్టర్ బ్యాంకు మేనేజర్ తో మాట్లాడుతూ అధికారులు హ్యాండ్ వాష్ చేసుకోవాలని,బ్యాంకు వచ్చే ప్రజలకు సామజిక దూరం పాటించేలా ఉంచాలని తెలిపారు.

Update: 2020-04-09 13:48 GMT
Collector Harichandana

నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సివిల్ లైన్ బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ హరిచందన ఆకస్మికంగా సందర్శించి కలెక్టర్ బ్యాంకు మేనేజర్ తో మాట్లాడుతూ అధికారులు హ్యాండ్ వాష్ చేసుకోవాలని,బ్యాంకు వచ్చే ప్రజలకు సామజిక దూరం పాటించేలా ఉంచాలని తెలిపారు. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలన్నారు.

బ్యాంకు ముందు ఓ టెంట్ ను ఏర్పాటు చేసి హ్యాండ్ వాష్ చేసి లోపలికి వచ్చే విధంగా చూడాలని అన్నారు. గ్రామాలలో ఉండే బ్యాంకు మిత్రలను తీసుకొచ్చి కౌంటర్లను ఏర్పాటు చేసివారి ద్వారా సేవలను సద్వినియోగం చేసికోవాలని సూచించారు. దేశ ప్రధాన మంత్రి నుండి ప్రజలకు ఇచ్చే 500/-బడ్జెట్ వచ్చాయని తెలుసుకున్నారు.

మీరు, మీ బ్యాంకు సిబ్బంది అందరు కూడా జాగ్రత్త గా ఉండాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, గంటకొకసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఎల్డీఎం ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News