Mahashivratri 2024: మార్చి ఒకటో తేదీ నుంచి 11 రోజులు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Mahashivratri 2024: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లకు ఆదేశం

Update: 2024-01-19 12:00 GMT

Mahashivratri 2024: మార్చి ఒకటో తేదీ నుంచి 11 రోజులు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Mahashivratri 2024: శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు దేవస్థానం పరిపాలన భవనంలో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్, వైద్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని, అధికారులందరు సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని.. పాదయాత్ర మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గం నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటవీశాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ప్రతి విభాగం యాక్షన్ ప్లాన్ రూపొందించి కార్యాలయానికి అందించాలన్నారు.

యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా వెంటనే ఏర్పాట్లను చేపట్టాలన్నారు. అలాగే ఉత్సవాలలో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటిపై చర్చించారు. బ్రహ్మోత్సవాలలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకు సూచించారు.

Tags:    

Similar News