SRSP Water Level: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
SRSP Water Level: ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
SRSP Water Level: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087.2 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75.867 టీఎంసీల నీరు నిల్వ ఉంది.