Srinivas Goud: ఈడీ, సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు
Srinivas Goud: అదానీ లక్షల కోట్లు దోచుకున్న దానిపై విచారణ జరిపించడం లేదు
Srinivas Goud: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైరయ్యారు. ఈడీ, సీబీఐ కేంద్రం చేతిలో ఉన్నాయని.. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొస్తే కవితకు ఏమిటి సంబంధమని నిలదీశారు. అదానీ లక్షల కోట్లు దోచుకున్న దానిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక.. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి.. వేధిస్తున్నారన్నారు. దీంట్లో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు.