Sriram Sagar: నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
*9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
Sriram Sagar: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తయారైంది. ఎడతెరపిలేని వర్షాలకు వరద ప్రవాహం పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే వరద కాస్త తగ్గుతుందనుకుంటున్న సమయంలోనే ఎస్సారెస్పీకి మళ్లీ ఇన్ ఫ్లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 48వేల850 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో అధికారులు 9 గేట్లను ఎత్తి 24వేల984 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1088.30 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 77.383 టీఎంసీలుగా నమోదైంది.