రామానుజ విగ్రహావిష్కరణకు రండి.. గవర్నర్ తమిళిసైకి చినజీయర్ స్వామి ఆహ్వానం
Ramanuja Statue Inauguration: భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది.
Ramanuja Statue Inauguration: భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్‌ను భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి... ఆహ్వాన పత్రికను అందించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కూడా ఉత్సవాలకు ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.
ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించనున్నారు. స్వర్ణమయ శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగనుంది. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ పాల్గొనబోతున్నారు.