Sputnik V: హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్
Sputnik V: రష్యా నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరిక * 56.3 టన్నుల వ్యాక్సిన్ల దిగుమతి
Sputnik V: రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్నాయి. రష్యా నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకున్నాయి. మొత్తం 56.6 టన్నుల వ్యాక్సిన్‌లు దిగుమతి అయ్యాయి. ఇప్పటివరకు విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన వ్యాక్సిన్‌లలో ఇదే అతి పెద్దది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా GHAC స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేక నిర్వహణ అవసరమవుతుంది. ఈ వ్యాక్సిన్‌లు -20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.