హైదరాబాద్‌లోనే ఎందుకిన్ని కేసులు వస్తున్నాయ్.. అసలు ఈ నగరానికి ఏమైంది?
హైదరాబాద్ మహానగరిపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా రక్కసి పడగ నీడలో రాజధాని విలవిల్లాడుతోంది. తెలంగాణ రాష్ట్రమంతటితో పోల్చుకుంటే 62 శాతం కేసులు భాగ్యనగరంలోనే నమోదు అవుతుండటం ఆందోళనకరం. పశ్చిమ మండలంలో కరోనా పడగ విప్పి కరాళ నృత్యం చేస్తుంటే దక్షణ, ఉత్తర మండలాల్లో మరణాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. అంతో ఇంతో తూర్పు జోన్‌లో కరోనా లక్షణాలు కనపడకపోవడం కాస్త ఊరట కలిగించే విషయమే అయినా బాధితుల్లో పురుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు. సువిశాల భాగ్యనగరంలో మొత్తం 154 కంటెయిన్‌మెంట్ ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఎందుకిన్ని కేసులు వస్తున్నాయ్.? భాగ్యనగరిపై కరోనా ఎందుకింతగా పగ పెంచుకుంటోంది.? అసలు ఈ నగరానికి ఏమైంది?
శతాబ్దాల నగరం ఒకానొక సూక్ష్మక్రిమితో అల్లాడుతోంది. రంకెలు వేస్తున్న రక్కసిని కట్టడి చేయలేక విలవిలలాడిపోతోంది. ఎక్కడి నుంచి వచ్చి ఎలా విరుచుకుపడిందో కానీ మహమ్మారి విజృంభణతో భాగ్యనగరం బెంబేలెత్తిపోతోంది. ఎవరి పనుల్లో వారు ఉంటే తన పనిని తాను ఎంచక్కా చేసుకొని వెళ్తోంది కరోనా. ఏంటీ అసలు కరోనా ఇప్పట్లో కంట్రోల్ అవదా? లేక కంట్రోల్ చేయలేకపోతున్నారా? లోపం ఎక్కడుంది? రక్కసి విలయం ఎలా కొనసాగుతోంది?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..