Telangana: ఎల్లుండి వరకు తెలంగాణలోకి నైరుతి ప్రవేశం

Southwest Monsoon: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది.

Update: 2024-06-03 04:55 GMT

Telangana: ఎల్లుండి వరకు తెలంగాణలోకి నైరుతి ప్రవేశం

Southwest Monsoon: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతమైనట్లు వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇక నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. సిటీలో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో భారీ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు పశువులు మృతి చెందాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.

Tags:    

Similar News