Social Media Cyber Crime: సోషల్ మీడియా లో హద్దులు దాటితే కటకటాలే!

Social Media: సోషల్ మీడియా.. భావ ప్రకటనకు మార్గమైంది. అభిప్రాయాలను పంచుకునే వేదికైంది. అవధులను చేరిపేసింది. స్నేహాలను పెంచేసింది.

Update: 2020-06-26 09:08 GMT

Social Media Cyber Crime: సోషల్ మీడియా.. భావ ప్రకటనకు మార్గమైంది. అభిప్రాయాలను పంచుకునే వేదికైంది. అవధులను చేరిపేసింది. స్నేహాలను పెంచేసింది. అందుకే ప్రతిఒక్కరికి కనెక్ట్ అయిoది ఈ సోషల్ మీడియా. ఇదంతా ఒక వైపే మరోవైపు బతుకులను బజారున పెడుతోంది. అసత్యాలను వైరల్ చేస్తోంది. మార్ఫింగ్ చిత్రాలతో మాయ చేస్తోంది. కొందరిని సెలబ్రిటీలను చేస్తే మరి కొందరిని జైల్ కి పంపింది. సోషల్ మీడియా వేదికగా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వారందరికీ చెక్ పెట్టేందుకు సైబర్ క్రైం పోలీసులు చర్యలు చేపట్టారు.

ఒక్క సిరా చుక్క లక్ష మొదళ్లను కదిలిస్తుంది. ఇదీ ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఒక్క పోస్ట్ కోట్ల మందిని కదిలిస్తుంది. దేశాలతో సంబంధం లేదు. అవధులతో అవసరం లేదు. వారందరినీ కలిపే ఒకే ఒక వేదిక ఇంటర్నెట్. ఇంతవరకు బానే ఉంది. కానీ కొందరు నెటిజన్లు సినీ, రాజకీయ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని నెగెటివ్ ప్రచారాలకు ఒడిగడుతున్నారు. రూమర్లు సృష్టించి మానసికంగా వేధిస్తున్నారు. తమ పోస్టులతో మనోభావాలను దెబ్బతీస్తున్నారు.

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి ఆటకట్టించేందుకు రంగంలోకి దిగారు సైబర్ క్రైం పోలీసులు. లుక్ అవుట్ నోటీస్ జారీ జారీ చేసి సులభంగా అడ్రస్ ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. సోషల్ మీడియా యజమానులకు పోలీసులు వివరాల కోసం లేఖలు పంపిస్తారు. వారు వెంటనే ఐపీ అడ్రస్ ద్వారా పోస్ట్ చేసిన వారి పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

దుబాయిలో ఉంటూ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పన్యాల రాజును పోలీసులు లాక్ అవుట్ నోటీస్ జారీ చేసి పట్టుకున్నారు. అలాగే హీరోయిన్ మీరా చోప్రా కూడా ఎన్టీఆర్ అభిమానులు తనపై అసభ్యకర పోస్టులు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా సంస్థ యజమానుల ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు కానీ కొందరు తమ ఖాతాలను డిలీట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

చేతిలో సోషల్ మీడియా ఉందని ఏదిబడితే అది పోస్ట్ చేస్తే జైల్ కు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మంచి కోసం వాడాలి తప్పా ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టకూడదని సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు పోలీసులు అనేక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అసభ్యకర పోస్టులతో టైం పాసు చేసే వారు తమ పంథా మార్చుకుంటే మంచిది.

Full View


Tags:    

Similar News