Rekha Naik: బీఆర్ఎస్ అభ్యర్థికి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ వార్నింగ్
Rekha Naik: తానింకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం మరవద్దని హెచ్చరిక
Rekha Naik: బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ హెచ్చరించారు. తన పదవి ముగియలేదని... తాను ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం మరిచిపోవద్దని అల్టిమేటం జారీ చేశారు. నియోజకవర్గానికి రావలసిన నిధులను అడ్డుకుంటే మూల్యం చెల్లించక తప్పదని ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ACDP నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. నియోజికవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.