రేవంత్ అందుబాటులో లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించిన అధికారులు
Revanth Reddy: ఈనెల 23న ఉ.11గంటలకు విచారణకు రావాలని నోటీసులు
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. రేవంత్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఈనెల 23న ఉదయం 11గంటలకు విచారణకు రావాలని సిట్ ఆదేశించింది. గ్రూప్-1 ప్రిలీమ్స్కు సంబంధించి ఆధారాలు చూపాలని నోటీసుల్లో పేర్కొంది. TSPSC పేపర్ లీకేజీకి సంబంధించి గ్రూప్-1 ప్రిలీమ్స్లో ఒకే మండలానికి చెందిన వారికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని సిట్ నోటీసులు పంపింది.