Bonalu Festival 2021: బోనం పాట వివాదంపై మంగ్లీ వివరణ
Bonalu Festival 2021: ప్రముఖ సింగర్ మంగ్లీ బోనాల పాటపై రచ్చ కొనసాగుతోంది.
Bonalu Festival 2021: ప్రముఖ సింగర్ మంగ్లీ బోనాల పాటపై రచ్చ కొనసాగుతోంది. ఆమె ఇటీవల విడుదల చేసిన బోనం పాటలో అమ్మవారిని నిందిస్తూ పదాలు ఉన్నాయని.. ఇది హిందూ సంస్కృతిని కించపరచడమేనంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారుతున్న ఈ వివాదంపై మంగ్లీ స్పందించారు. వాస్తవానికి తాను గిరిజన సంస్కృతి నుంచి వచ్చిన దానినేనని ఆమె తెలిపారు.. చెట్లు, పుట్టలు, ప్రకృతిని కొలవడం తమ ఆనవాయితీ అని అన్నారు. తాను పాడిన ఈ పాట25 ఏళ్ల క్రితం రాసినదని, అప్పటి పాటల్లో అన్నీ నిందాస్తుతితోనే ఉన్నాయని అన్నారు.. తానెక్కడా లిరిక్స్ మార్చలేదని, ఆ రచయిత కూడా తన రచనను సమర్ధించు కున్నారన్నారు. పాటల అర్ధం తెలియని వారే ఇలా తనను నిందిస్తున్నారని మంగ్లీ ఎదురు దాడి చేశారు.