Bhadrachalam: రాములోరి తలంబ్రాలకు ఓ ప్రత్యేకత

Bhadrachalam: తలంబ్రాలను తాకితే ఫుణ్యమని భక్తుల నమ్మకం * గోటి తలంబ్రాలను తయారు చేసే ఛాన్స్‌ కొట్టేసిన చీరాల వాసులు

Update: 2021-03-15 08:58 GMT

ఫైల్ ఫోటో 

Bhadrachalam: లోక కల్యాణంగా భావించే భద్రాద్రి సీతారాములవారి కల్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో.. ఆ కల్యాణంలో వినియోగించే గోటి తలంబ్రాలకు సైతం అంతే ప్రత్యేకత దాగి వుంది. ఆ కల్యాణ వేడుకల్లో ఆ తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు. అటువంటిది ఆ జానకీ రాముడి కల్యాణానికి వినియోగించే కోటి గోటి తలంబ్రాలను స్వయంగా తయారు చేస్తే.. ఆ అనుభూతే వేరు. అటువంటి మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా చీరాల వాసులు.

భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాములవారి కల్యాణానికి.. గత ఏడేళ్లుగా కోటి గోటి తలంబ్రాలను ఒలిచి కల్యాణ వేడుకలకు తరలిస్తూ స్వామివారి సేవలో పునీతులవుతున్నారు శ్రీ రఘురామ భక్త సేవాసమితి సభ్యులు. భక్తి శ్రద్ధలతో పట్టణ వాసులను భాగస్వాములను చేసుకొని రామనామ జపం చేస్తూ కొన్ని నెలలపాటు కష్టపడి 15 వేల కిలోల తలంబ్రాలను గోటితో ఒలిచి.. రాములోరి కల్యాణ వేడుకలకు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి మహోత్కర కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News