Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా బంగారం అక్రమ రవాణా.. పేస్ట్,పౌడర్ రూపంలో బంగారం స్మగ్లింగ్‌

Shamshabad: ఎన్ని తనిఖీలు చేస్తున్నా అక్రమరవాణాను కొనసాగిస్తున్న కేటుగాళ్లు

Update: 2023-08-13 09:06 GMT

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా బంగారం అక్రమ రవాణా.. పేస్ట్,పౌడర్ రూపంలో బంగారం స్మగ్లింగ్‌    

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టుబడుతోంది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ప్రయాణికుల నుంచి కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మొన్న అబుదాబి నుండి చెన్నైకి చేరుకున్న సమయంలోనే అధికారుల చేతికి చిక్కకుండా బంగారాన్ని పేస్ట్‌గా చేసి ఆ పేస్ట్‌ని విమానంలో ఉన్న టాయిలెట్ లోని వాష్ బేసిన్ కింద లేడి స్మగ్లర్ దాచి పెట్టింది. మహిళ నడవడిక మీద అధికారులకు అనుమానంరావడంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అక్రమ బంగారం వ్యవహారం గుట్టు రట్టు అయింది. లేడి కిలాడీని అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుండి 94.99 లక్షల విలువ చేసే 1.329 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరో ముఠా అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నం చేస్తోండగా.. శంషాబాద్ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ప్రయాణికుడు ప్యాంట్ జేబులో దాచినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.

దుబాయ్ నుంచే కాదు... బ్యాంకాక్ నుంచి వచ్చే వారు కూడా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులలో ఒక ప్రయాణికుడి వద్ద నుండి కోటి ఇరవై ఒక్క లక్షల 34 వేల రూపాయల విలువచేసే రెండు కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి దగ్గర కోటి 8 లక్షల రూపాయల విలువచేసే 1.78 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. షార్జా నుండి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద నుండి కోటి 31 లక్షల 77 వేల 524 రూపాయల విలువచేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుండి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద నుండి ఒక కోటి 24 లక్షల 31 వేల రూపాయల విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.

తనిఖీలు కట్టుదిట్టం చేసినా అధికారుల కళ్లుగప్పి పెద్ద ఎత్తున బంగారం బయటకు వెళుతున్నట్లు ఆరోపణలు వెళ్లివెత్తుతున్నాయి. ఎయిర్ పోర్టు బయట ఓ టాక్సీ అనుమానాస్పదంగా కనిపించడంతో ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తనిఖీ చేశారు. దీంతో నిందితుడి వద్ద కిలో బంగారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News