హైదరాబాద్‌ శివారులో వరుస హత్యల కలకలం

* వ్యక్తిని హత్య చేసి సూట్‌కేసులో తెచ్చి ఉప్పర్‌పల్లి వద్ద వదిలివెళ్లిన దుండగులు * మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని పల్లెచెరువు వద్ద మరో హత్య

Update: 2021-01-10 06:19 GMT

Representational image

హైదరాబాద్‌ శివారులో వరుస హత్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాజేంద్రనగర్‌లో డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. డైరీఫామ్‌ దగ్గర సూట్‌కేసులో డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడు రియాజ్‌ చాంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక ఈ కేసులో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన మరువక ముందే మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధి పల్లెచెరువు దగ్గర మరో హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని ఓ వ్యక్తిని హత్య చేసి కవర్లో చుట్టి ఓ పాత ఆటోలో వదిలివెళ్లారు దుండగులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఇది హత్యకాదని.. వృద్ధుడు మద్యం సేవించి ఆటోలో పడుకున్న తర్వాత చలికి మృతి చెంది ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు. 

Tags:    

Similar News