Amnesia Pub Incident: రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు.. మరో అమ్మాయిని వదలని కీచకులు!
*బాధిత బాలికతో పాటు మరో బాలికను వేధించిన కీచకులు
Hyderabad: అమ్నేషియా పబ్, కారులో బాలికపై అత్యాచార కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను కీచకులు వేధించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలో కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. వేధింపులు భరించలేకే పబ్ నుండి బాలికలు బయటకు రాగా, బాలికల వెనకాలే సాదుద్దీన్ అండ్ గ్యాంగ్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. పబ్ ఎదుటే నిలబడ్డ బాలికను ట్రాప్ చేసిన కార్పొరేటర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్ ఖాన్‌కు చెందిన బెంజ్ కారులో తీసుకెళ్లాడు. ఆకారులో బాలికతోపాటు నలుగురు ప్రయాణం చేశారు. కాగా ఫోన్ కాల్‌తో మధ్యలోనే ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయినట్లు సమాచారం.